
శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం
కందిమల్లాయపల్లె పోస్ట్, బ్రహ్మంగారి మఠం మండలం, కడప జిల్లా-516 503, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు పదునేడవ శతాబ్ది ప్రారంభమున జన్మించి, ఆ శతాబ్ది చివరిదాకా ప్రజలలో పేరుకుపోయిన మూడ విశ్వాసాలను కులమత మౌడ్యాన్ని నిరసించి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సమతా సిద్దాంతాన్ని ప్రతిపాదించిన సంఘ సంస్కర్త. భూత భవిష్యద్వర్త మానములను తన కాలజ్ఞానమున ప్రతిపాదించిన త్రికాలజ్ఞ దిషణుడు తిరిగి తాను వీరభోగ వసంత రాయలుగా అవతరించి ధర్మాన్ని పున: స్థాపించనున్నానని దుర్మార్గులను హెచ్చరించి, ప్రజలను జాగరిత పరిచిన విధిజ్ఞుడు. తాను చెప్పినది ఆచరించి చూపిన ఆదర్శవాది. తన జీవితాన్ని మానవజాతి కోసం అర్పించి, సజీవ సమాధి నిష్ట వహించిన అవతారమూర్తి.
ఆ స్వాములవారు సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర ప్రదేశమే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం (కందిమల్లాయ పల్లె). ఒకానొక వైశాఖ శుద్ద దశిమినాడు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు సజీవ సమాధిలో ప్రవేశించారని భక్తుల విశ్వాసము. క్రీ. శ. 1963లో శ్రీ స్వాములవారు సజీవ సమాధి నిష్ట వహించి యుండవచ్చునని ప్రస్తుత మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వాములవారు విశ్వసించు చున్నారు.