శ్రీ సిద్దయ్యస్వాములవారి మఠం, ముడుమాల గ్రామము

Siddayya Swamy Mattam

                శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ముఖ్య శిష్యులలో ఒకరైన సిద్దయ్య పుట్టిన గ్రామము ముడుమాల. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠంనకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్దయ్య ముస్లిం మతస్థుడైనా ముఖ్యశిష్యునిగా పేరుగాంచాడు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామిని ఏకాగ్రతతో సేవిస్తూ సిద్దయ్య వంటి శిష్యూడు లేడని కీర్తిని పొందాడు. శ్రీ స్వాములవారి సజీవ సమాధి సేవకు పూలు తీసుకొని రావటానికి బనగాని పల్లెకు వెళ్ళాడు. తిరిగి వచ్చేలోపు శ్రీ స్వాములవారు సజీవ సమాధి అయ్యారని విలపిస్తూ ఆత్మత్యాగానికి సిద్దపడ్డాడు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు తన శిష్యుడు సిద్దయ్య భక్తికి మెచ్చి తన యోగదండం, పాదుకలు, శిఖాముద్రిక, కాలజ్ఞానము తాళపత్రములను బహూకరించి రాజయోగమున ఉండమని ఆజ్ఞాపించాడు. అవి తీసుకొని ముడుమాల వెళ్లి శ్రీ స్వాములవారు ఇచ్చిన వస్తువులకు నిత్యపూజలు జరుపుతూ ముడుమాల గ్రామానికి తూర్పు భాగాన సమాధి చెందాడు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు సిద్దయ్యకు ఇచ్చిన శిఖాముద్రిక, యోగదండం, పాదుకలు, కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రతి సంవత్సరము మూలా నక్షత్రములో ప్రజలు, యాత్రికులు, భక్తుల దర్శనార్థం ఉంచుతారు. మిగతా రోజులలో ప్రత్యేక గదిలో భద్రపరచి ఉంచుతారు. భక్తులు, యాత్రికులు సిద్దయ్య మఠం పీఠాధిపతుల అనుమతితో వాటిని దర్శించవచ్చు. సిద్దయ్య కుమారులలో తపశ్శక్తి కలిగిన పెద్ద పీరయ్య తనకు మొదటి పూజ జరగాలని, తన తండ్రి సమాధిని ప్రక్కకు జరిగి తనకు తావివ్వలని కోరగా సిద్దయ్యగారి సమాధి ప్రక్కకు జరిగిందని అప్పటినుండి పెద్ద పీరయ్యకే మొదట పూజచేయటం అక్కడివారి ఆనవాయితీ. ఉగాది పర్వదినాన పెద్దపీరయ్యగారి ఆరాధన పేరుతో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబడతాయి. శిఖాముద్రికపై “అయ్యవారు” అనే అక్షరాలు ఉంటాయి. అక్కడ వీటితోబాటే సిద్దయ్యస్వాములవారు సేకరించుకున్న అనేక తాళపత్ర గ్రంథాలు కూడా చూడగలము. ఇక్కడ పంచముఖాలతో వున్న పెద్ద వేపచెట్టు ఒక ప్రత్యేకత. అర్థనారీశ్వర సాలగ్రామం ఇక్కడ ఉన్నది.

How to reach Sri Siddayya Swamy Mattam, Mudumala

Sri Siddayya Swamy Mattam, Mudumala is a famous Piligrimage Center in Kadapa Dist. In the state of Andhra Pradesh in India. Located Pop 3,105; (Lat. 14o50N; Long. 78°50E).

Mattam Bus

By Road:Mudumala Village is located 75 km from Kadapa. It is well connected by road. The preferable route is Kadapa-Mydukur-Amagampalle-Mudumala. From Mydukur the distance is 52 km. From Hyderabad the route is Hyderabad - Kurnool - Nandyal - Allagadda - Mydukur - Amagampalle - Mudumala. Direct buses are available from Badvel, Mydukur, Proddutur and Kadapa. Distance from Badvel to Mudumala is around 25 km. Guest houses are available at Mudumala (Siddayyagari Mattam).